Priya Bapat | షూటింగ్లో కో-స్టార్ వేధింపులు.. ‘నాకు ముద్దు పెడుతూనే ఉన్నాడంటూ’ బాలీవుడ్ నటి ఆవేదన
Priya Bapat | బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమలలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా బాపట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని తాజాగా పంచుకుంది.
Priya Bapat | బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమలలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా బాపట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని తాజాగా పంచుకుంది. తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో ఒక పాట చిత్రీకరణలో సహ నటుడు తనకు నచ్చకపోయినా పదే పదే ముద్దు పెట్టుకున్నాడని, ఆ సమయంలో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని ఆమె వెల్లడించారు. కథా చర్చల సమయం నుంచే తాను ఆ ముద్దు సీన్ అవసరమా అని దర్శకుడిని ప్రశ్నించానని, అయితే షూటింగ్ స్పాట్లో మాత్రం సదరు నటుడు స్క్రిప్ట్‌లో లేని విధంగా, ఇంప్రూవైజేషన్ పేరుతో హద్దులు దాటి ప్రవర్తించాడని ప్రియా బాపట్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఏం చేయాలో తోచక, తన గొంతు ఎలా వినిపించాలో తెలియక ఎంతో నిస్సహాయంగా ఉండిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఇబ్బందికరమైన వాతావరణం కేవలం షూటింగ్‌తోనే ముగిసిపోలేదని, తామిద్దరూ ఒకే హోటల్లో బస చేసినప్పుడు, తాను ఎన్నిసార్లు నిరాకరించినా ఆ నటుడు బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌కు రమ్మంటూ పదే పదే వేధించాడని ప్రియ తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన తాను ప్రతిరోజూ రాత్రి తన భర్త ఉమేష్ కామత్‌కు ఫోన్ చేసి ఏడ్చేదాన్నని, దాంతో ఆందోళన చెందిన ఆయన వెంటనే ముంబై నుండి భోపాల్ షూటింగ్ స్పాట్‌కు వచ్చి మూడు రోజుల పాటు తనతోనే ఉన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘మున్నాభాయ్ MBBS’ చిత్రంతో పాటు ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా బాపట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

