పంచభూతాల కథ
మంగళవారం అగ్ర నటుడు చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన 157వ చిత్రాన్ని ప్రకటించారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సోషియోఫాంటసీ కథాంశంతో తెరకెక్కించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వీ.
మంగళవారం అగ్ర నటుడు చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన 157వ చిత్రాన్ని ప్రకటించారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సోషియోఫాంటసీ కథాంశంతో తెరకెక్కించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వీ. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. పంచభూతాలను ప్రతిబింబించే థీమ్‌తో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ‘మెగా మాస్ బియాండ్ యూనివర్స్’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ను జత చేసింది. ‘అంజి’ (2004) తర్వాత మరలా చిరంజీవి సోషియో ఫాంటసీ కథాంశంతో సినిమా చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది.
చిరు 156వ సినిమా ప్రకటన
పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటించబోతున్న 156వ సినిమా ప్రకటన కూడా వెలువడింది. ఈ చిత్రానికి ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించనుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. ఈ చిత్ర దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

