ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో వైవా హర్ష మాట్లాడుతూ ‘నాలుగు నెలల్లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసి రిలీజ్ చేయడం కేస్ స్టడీ. ఇందులో వినోదంతో పాటు అద్భుతమైన భావోద్వేగాలుంటాయి’ అని తెలిపారు. ‘ఈ కథకు హర్ష అయితే కరెక్ట్. అందుకే ఆయన్ను కలిశాను. కథ విన్నవెంటనే ఆయన ఓకే చెప్పారు. ఆయన సహకారం వల్లే సినిమాను ఇంత బాగా వచ్చింది’ అని దర్శకుడు బాబు చెప్పారు. ఇంకా ఈటీవీ ప్రతినిధి సాయికృష్ణ, నిర్మాత చవాన్, దీపక్, హైపర్ ఆది, ఐశ్వర్య, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుహాస్, ప్రేమ్‌సాగర్ కూడా మాట్లాడారు.