Harom Hara | యువ నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. విడుదల తేదీ కూడా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేయనున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మూవీలో తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశాడు సుధీర్‌బాబు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలుపుతూ ఇంగ సెప్పేది ఏం లేదు.. సేసేదే అంటూ ఎక్స్ వేదికగా రాసుకోచ్చింది.
సుబ్రహ్మణ్య స్వామిని పూజించే సమయంలో ఎక్కువగా ‘హరోం హర’ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్టుగానే ఈ సినిమాలో తిరుగుబాటు అనేది ఉంటుందని దర్శకుడు వెల్లడించాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా రానుంది.. ఈ మూవీలో మాళవిక, సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుధీర్‌బాబు కుప్పం యాసలో అలరించనున్నట్లు తెలిపాడు.
#HaromHara Dubbing Completed and Subramanyam is all set to storm the theatres on MAY 31st #HaromHaraOnMay31st pic.twitter.com/yA475if63N
— Vamsi Kaka (@vamsikaka) May 4, 2024