Harom hara | సుధీర్ బాబు హరోంహర నయా లుక్‌తో స్పెషల్ వీడియో అప్డేట్
Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హరోం హర (Harom Hara: The Revolt). తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ విడుదల చేశారు.
Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హరోం హర (Harom Hara: The Revolt). పాన్ ఇండియా కథాంశంతో Sudheer18గా తెరకెక్కుతున్న ఈ మూవీని సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ కాన్సెప్ట్ టైటిల్ వీడియో ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ విడుదల చేశారు.
అంతేకాదు Power Of Subramanyam పేరుతో నవంబర్ 22న స్పెషల్ వీడియోను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
టపాసుల పండక్కి సిద్ధం కండా.. పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అంటే ఏమో 22 నింకి సూస్తారు!.. అంటూ లాంఛ్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. లేటెస్ట్ పోస్టర్లో సుధీర్ బాబు ఇంటెన్స్ లుక్‌లో అదరగొడుతున్నాడు. ఈ మూవీ 1989 నేపథ్యంలో చిత్తూరులోని కుప్పం బ్యాక్ డ్రాప్లో సాగే కథతో పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తుండగా.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హరోం హర సుధీర్ బాబు కెరీర్లోనే హై బడ్జెట్ ఎంటర్టైనర్గా వస్తోంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు కథానుగుణంగా కుప్పం యాసలో మాట్లాడబోతున్నాడట. ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్.
హరోంహర నయా లుక్..
టపాసుల పండక్కి సిద్ధం కండా!
పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అంటే ఏమో 22 నింకి సూస్తారు!😎#HappyDeepavali#HaromHara Teaser from 22nd Nov!!#Diwali2023@gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @jungleemusicSTH pic.twitter.com/HTupI9m7dL— Sudheer Babu (@isudheerbabu) November 12, 2023
హరోం హర కాన్సెప్ట్ టైటిల్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

