సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘హారోం హర’ టైటిల్‌ను ఖరారు చేశారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. సోమవారం కాన్సెప్ట్ టైటిల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో 1989 నాటి నేపథ్యాన్ని, సుబ్రమణ్యస్వామి ఆలయం, జగదాంబ టాకీస్, రైల్వేస్టేషన్ వంటి ప్రదేశాలకు చూపించారు. ‘ఇంగా సెప్పేదేం లేదు..సేసేదే..’ అంటూ సుధీర్‌బాబు చిత్తూరు యాసలో చెప్పిన సంభాషణ ఆకట్టుకుంది.
సుధీర్‌బాబు మాస్ గెటప్‌లో కనిపించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్భరద్వాజ్, సమర్పణ: రమేష్‌కుమార్ జి, నిర్మాత: సుమంత్ జి నాయుడు, రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక.