Harom Hara | సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సుధీర్‌బాబు ‘హరోంహర’
Harom Hara | టాలీవుడ్ యువ కథానాయకుడు సుధీర్‌బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది.
Harom Hara | టాలీవుడ్ యువ కథానాయకుడు సుధీర్‌బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌తో పాటు ట్రైలర్లు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. అయితే విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటంతో తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు ఏ (A) సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిపింది.
1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా రానుంది.. ఈ మూవీలో మాళవిక, సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుధీర్‌బాబు కుప్పం యాసలో అలరించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్. సంగీతం చైతన్ భరద్వాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

