Hari Hara Veera Mallu | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇందులో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ సినిమాకు జాగర్లమూడి కృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నాడు. గత ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు సగం కూడా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇక పవన్ కల్యాణ్ ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్తో ఈ సినిమా షూటింగ్ అప్పుడప్పుడు జరుగుతూ వస్తుంది. అయితే చిత్రం నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజుల అయిన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో పవన్ బర్త్ డే సందర్బంగా కొత్త పోస్టర్ వదలడం చేశారు. ఇదిలావుంటే పవన్ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తూ ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి ప్రోమో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ టీం ఇప్పటికే రిలీజ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.