Hari Hara Veera Mallu | పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బర్త్‌డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ సర్ప్రైజ్
Hari Hara Veera Mallu Movie | ఈ ఏడాది ‘భీమ్లానాయక్’తో అభిమానులలో ఫుల్ జోష్ నింపాడు పవన్ కళ్యాణ్. రానా కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘హరి హర వీర మల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే షూటింగ్ ప్రారంభమై నెలలు గడుతుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్లను మేకర్స్ ప్రకటించడం లేదు. దాంతో పవన్ ఫ్యాన్స్ మేకర్స్‌పై తీవ్ర ఆసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ గ్లింప్స్‌కు ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు టాక్. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక పవన్ బర్త్‌డే స్పెషల్ సెప్టెంబర్ 2న ‘జల్సా’, ‘తమ్ముడు’ సినిమాలు రీ రిలీజ్ అవున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ‘జల్సా’ సినిమాకు 500 షోస్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇప్పటికే ‘జల్సా’ మూవీకు ఆర్టీసి క్రాస్ రోడ్‌లోని సంధ్య 75ఎమ్ఎమ్, సంధ్య 35, దేవి థియేటర్లో హౌస్ ఫుల్ అయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

