Hari Hara Veera Mallu | ఎట్టకేలకు హరి హర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్‌కు ఇకపై పండగే..!
Hari Hara Veera Mallu Movie | పవన్ కళ్యాణ్ లైనప్‌లో హరి హర వీరమల్లు అనే సినిమా ఒకటుందని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయే స్థితికి వచ్చారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండేళ్ల క్రితమే పట్టాలెక్కింది.
Hari Hara Veera Mallu Movie | పవన్ కళ్యాణ్ లైనప్‌లో హరి హర వీరమల్లు అనే సినిమా ఒకటుందని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయే స్థితికి వచ్చారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండేళ్ల క్రితమే పట్టాలెక్కింది. కానీ ప్యాసింజర్ ట్రైన్‌లా నెమ్మదిగా ప్రయాణం సాగిస్తుంది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్‌కు ఏ విధంగా బ్రేకులు పడతాయో హరిహర వీరమల్లు పరిస్థితి కూడా దాదాపుగా అంతే. ఐదారు నెలల కింద ప్రకటించిన సినిమాలు సైతం షూటింగ్ చివరి దశలోకి వచ్చేస్తున్నాయి. కానీ హరి హర వీరమల్లు మాత్రం ఓ కొలిక్కి రాలేకపోతుంది. ఈ సినిమా పెండింగ్ వర్క్ ఇంకా చాలానే ఉందని ఇన్సైడ్.
పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను పక్కన పెట్టాడు. పైగా ఐదారు నెలల్లో కంప్లీట్ అవుతుందంటే డేట్స్ అడ్జెస్ట్ చేయోచ్చు. కానీ ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటుంది. అందుకే పవన్ ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోతున్నాడట. దాంతో పవన్ తక్కువ రోజుల్లో పూర్తయ్యే బ్రో, ఓజీ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా హరి హర వీరమల్లు సినిమా క్యాన్సెల్ అయిందని, క్రిష్ వేరే హీరోతో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెగ వార్తలు పుట్టుకొచ్చాయి. కాగా తాజాగా ఈ రూమర్స్‌కు నిర్మాత ఏఎమ్ రత్నం బ్రేకులు వేశాడు.
షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేస్తామని, ఒకవేళ అలా జరగకపోతే వచ్చే ఏడాది సినిమాను తిరిగి ప్రారంభిస్తామని ఏఎమ్ రత్నం చెప్పాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌కు ఉన్న పొలిటికల్ ఇంట్రెస్ట్‌ను, కామన్ మ్యాన్ కోసం ఎదైనా చేయలనే ఆయన తపనను మేము కూడా అర్థం చేసుకోగలము అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ స్టేట్మెంట్తో హరి హర వీరమల్లు సినిమా ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా ఇన్‌స్టాలో పవన్ పోస్ట్ చేసిన వీడియోలో హరిహర వీరమల్లుకు సంబంధించిన పిక్‌ను కూడా యాడ్ చేశాడు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. చిత్రబృందం నుంచి అఫీషియల్‌గా రిలీజ్ కానీ.. నిధి అగర్వాల్‌తో ఉన్న పిక్‌ను పవన్ పంచుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

