భీమ్లా నాయక్ గ్లింప్స్‌పై హనుమ విహారి కామెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరు వింటే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఆయనంటే సెలబ్రిటీలు సైతం పడిచచ్చిపోతుంటారు. ఒక్కోసారి పవన్ మేనరిజాన్ని ఫాలో కావడం లేదంటే ఆయన ఫొటోలను, డైలాగులను తమ సినిమాలో వాడుకోవడం వంటివి చేస్తుంటారు. పవన్ సినిమాలు మానేశాడని మూడేళ్ల క్రితం ప్రకటించగా అందరిలో నిరాశ. మూడేళ్లు పవన్ సినిమా ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తూ రాగా, వకీల్ సాబ్తో రీ ఎంట్రీ ఇచ్చాడు.
తాజాగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు పవన్.దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయగా ఇందులో పవన్ మాస్ లుక్ చితక్కొట్టాడు. భీమ్లా నాయక్ గా పవన్ తన నట విశ్వరూపం చూపించి అందరి మనసులు దోచుకుంటున్నాడు.
టీమిండియా టెస్ట్ క్రికెటర్, కాకినాడ కుర్రాడు హనుమ విహారి కూడా ఈ ఫస్ట్ గ్లింప్స్‌కి ఫిదా అయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఉన్న హనుమ.. ఫస్ట్ గ్లింప్స్ అద్భుతం అనేలా కామెంట్ చేశాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ రానా మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను వదిలారు. ఇందులో భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతోన్నాడో చూపించారు. అంతేకాకుండా వచ్చే సంక్రాంతికి థియేటర్లో రాబోతోన్నట్టు ప్రకటించేశారు. ఈ అప్డేట్ చూసిన హనుమ విహారి చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలై ట్వీట్ చేశాడు.
Glimpse!! 😍💥
— Hanuma vihari (@Hanumavihari) August 15, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

