Hansika | వైరల్ వీడియో వివాదంపై హన్సిక స్పందన.. అది నా తప్పే, కానీ పబ్లిసిటీ కోసం కాదు ..
Hansika | ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణకుమార్ చిన్న కుమార్తె, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హన్సిక కృష్ణ ఇటీవల వైరల్‌గా మారిన వ్యక్తిగత వీడియో వివాదంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఈ ఘటన తనను, తన కుటుంబాన్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసిందని ఆమె వెల్లడించారు.
Hansika | ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణకుమార్ చిన్న కుమార్తె, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హన్సిక కృష్ణ ఇటీవల వైరల్‌గా మారిన వ్యక్తిగత వీడియో వివాదంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఈ ఘటన తనను, తన కుటుంబాన్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసిందని ఆమె వెల్లడించారు. సుదీర్ఘ ప్రకటనలో హన్సిక మాట్లాడుతూ, వైరల్ అయిన వీడియోను తాను ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీడ్‌లో అనాలోచితంగా అప్లోడ్ చేసిన మాట నిజమేనని అంగీకరించారు. అయితే అది పూర్తిగా తన పొరపాటు మాత్రమేనని, దాని కోసం తాను తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని పేర్కొన్నారు.
వీడియోను పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే తొలగించినప్పటికీ, అప్పటికే కొందరు దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి ఇతర సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేశారని ఆమె తెలిపారు. ఆ తర్వాత అది విస్తృతంగా వైరల్ కావడంతో వివాదం మరింత పెద్దదైందని చెప్పారు.ఈ ఘటనను పబ్లిసిటీ లేదా డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగా సృష్టించిందన్న ఆరోపణలను హన్సిక ఖండించారు. తనకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉందని, కేవలం ప్రచారం కోసం ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ వివాదం చెలరేగిన సమయంలో తన అక్క, నటి మరియు దర్శకురాలు అహానా కృష్ణ రూపొందించిన మ్యూజిక్ వీడియో విడుదలకు సిద్ధంగా ఉందని గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యుల కష్టాన్ని దెబ్బతీసేలా తాను ఉద్దేశపూర్వకంగా వ్యవహరించనని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తనపై జరిగిన సైబర్ బుల్లీయింగ్ గురించి కూడా హన్సిక స్పందించారు. కొందరు కేవలం వ్యూస్, ఎంగేజ్మెంట్ కోసం తనపై, తన కుటుంబంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తనకు మానసికంగా ఎంతో కష్టంగా మారిందని తెలిపారు. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ధరను పెంచడంపై వచ్చిన విమర్శలకు కూడా ఆమె వివరణ ఇచ్చారు. వివాదం తర్వాత కొత్త సబ్స్క్రైబర్లు చేరకుండా ఉండేందుకు తాత్కాలికంగా ధర పెంచినట్లు చెప్పారు. ఆ కాలంలో వచ్చిన అదనపు ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళంగా అందించినట్లు వెల్లడించారు. కాగా, సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించిన హన్సిక కృష్ణకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ వివాదాన్ని వెనక్కి నెట్టి తన సినీ కెరీర్‌పై దృష్టి సారించిన ఆమె, త్వరలో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

