Hansika Motwani Wedding | సినీ నటి హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. చిన్నప్పటి స్నేహితుడు సోహైల్‌ను హన్సిక ప్రేమ వివాహం చేసుకోబుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. జైపుర్‌లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో డిసెంబర్ 4న వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే పెళ్ళి పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాగా పెళ్లికి రెండు రోజుల ముందు నుండే మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా హన్సిక పెళ్ళి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
హన్సిక పెళ్లి వేడుక ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ పెళ్ళి వేడుక ప్రసారం కోసం భారీ డీల్ కుదిరించుకున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక గతంలో నయన్‌తార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి వేడుక కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. ఇప్పటికే నయన్-విఘ్నేష్‌ల పెళ్లయి 5 నెలలు అయింది. కానీ ఇంకా పెళ్లి వీడియో రిలీజ్ కాలేదు.