బిగ్ బాస్ తర్వాత పాపులారిటీ పెంచుకున్న కంటెస్టెంట్స్‌లో హమీదా ఒకరు. హౌస్‌లో గ్లామర్‌ను యాడ్ చేస్తూ, టాస్క్‌లలో తన వల్ల అయిన బెస్ట్‌ను అందిస్తూ వచ్చిన హమీదా ప్రేక్షకులని బాగానే ఎంటర్టైన్ చేసింది. శ్రీరామ్ చంద్రతో ఈ అమ్మడు రొమాన్స్ కొంత మందికి చిరాకు పుట్టించిన మరి కొందరు బాగానే ఎంజాయ్ చేశారు. సీజన్ 5 లవ్ బర్డ్స్ అంటూ వీరికి ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు.
హమీదా ఎలిమినేట్ కావడం శ్రీరామచంద్రతో పాటు మరి కొందరు కంటెస్టెంట్స్‌ని చాలా బాధించింది. ఈ అమ్మడు మాత్రం ఐదు వారాలు హౌజ్‌లో ఉన్నందుకు చాలా సంతోషించింది. అయితే హమీదా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం పక్కనపెడితే ఆమె పారితోషికం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క వారానికిగానూ హమీదా 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు చర్చ జరుగుతుంది.
ఐదు వారాలు ఉన్నందుకు గాను ఈ ముద్దుగుమ్మ నాలుగున్నర లక్షలకు పైగానే అందుకుందనే ప్రచారం నడుస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దగా లేని కారణంగానే హమీదా హౌజ్ నుండి ఎలిమినేట్ అయిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. కాగా, సీజన్ 5లో మొదటి వారం సరయూ, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.