ఒకప్పుడు బాలీవుడ్‌ను కుదిపేసిన నెపోటిజం, అదే బంధుప్రీతి మళ్లీ మరో రూపంలో పురుడు పోసుకుంది. అమెరికన్ మోడల్ హేలీ బీబర్ ధరించిన ఒక టీషర్ట్కారణంగా ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల హేలీ ‘నెపో బేబీ’ అని రాసి ఉన్న టీ-షర్ట్‌ను ధరించి, ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అంతవరకూ బాగానే ఉన్నా.. ఆ చిత్తరువును ఆలియా లైక్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వారసత్వ వివాదాన్ని ఆలియా మళ్లీ కదిపిందన్న కామెంట్లు నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి.