Hai Jawani Toh Ishq Hona Hai | బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్ మరియు పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ (Hai Jawani Toh Ishq Hona Hai). ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. లెజెండరీ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 46వ చిత్రమిది. ఆయన తన కుమారుడు వరుణ్ ధావన్‌తో కలిసి మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. టిప్స్ ఫిలిమ్స్ (Tips Films) అధినేత రమేష్ తౌరానీ, మాక్సిమిలియన్ ఫిలిమ్స్ (UK)తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.