Kajol: కాజోల్ నా కొడుక్కి ఇప్పటికీ నచ్చదు: షారూఖ్ ఖాన్

బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ షారూఖ్ ఖాన్-కాజోల్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలలో కలిసి నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీని చూసి ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేసేవారు. ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే, బాజీగర్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ ఘమ్’ చిత్రాలలో షారూఖ్- కాజోల్ ఒదిగిపోయి నటించారు. అప్పటి నుండి వీరికి హిట్ పెయిర్‌గా గుర్తింపు దక్కింది.
అయితే కాజోల్‌తో సినిమా చేసేందుకు షారూఖ్ చాలా ఇష్టపడతాడు.కాని షారూఖ్ తనయుడు అబ్‌రాంకు అస్సలు నచ్చదట. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ వాలే విషయాలు వెల్లడిస్తూ.. ఎప్పటిలానే నేను ఆ రోజు కూడా అబ్రాంని తీసుకొని దిల్వాలే షూటింగ్ సెట్‌కి వెళ్లాను. షూటింగ్ అనంతరం డైరెక్టర్ రోహిత్ శెట్టి ఆ రోజు సన్నివేశాలను కెమెరాలో చూపించేవాడు. నేను గాయపడిన సన్నివేశం చూసి అబ్రాం ఆ గాయాలు నాకు కాజోల్ వల్లే అయ్యాయని భావించాడు.
నాన్నకు నీవల్లే దెబ్బ తగిలింది అంటూ కాజోల్‌పై గట్టిగా అరిచాడు.అప్పటి నుండి కాజోల్ నాతో మాట్లాడిన, ఇద్దరం కలిసి కనిపించిన కూడా వాడికి అస్సలు నచ్చేది కాదు. స్రీన్‌పై కూడా తనతో నన్ను చూసినప్పుడు అబ్రాం గుర్రుగా చూస్తుంటాడు. ఇప్పుడు అది గుర్తు చేసుకుంటుంటే చాలా సరదాగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ పఠాన్, సంకీ అనే సినిమాలు చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- abram
- kajol
- Sharukh khan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

