Happy Raj | 11 ఏళ్ల తర్వాత వెండితెరపైకి ‘ప్రేమదేశం’ హీరో.. ఆకట్టుకుంటున్న ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్
Happy Raj | 90వ దశకంలో తన స్టైల్ మరియు నవ్వుతో కుర్రకారును ఉర్రూతలూగించిన లవర్ బాయ్ అబ్బాస్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు.
Happy Raj | 90వ దశకంలో తన స్టైల్ మరియు నవ్వుతో కుర్రకారును ఉర్రూతలూగించిన లవర్ బాయ్ అబ్బాస్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు. సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన వెండితెరపై కనిపించబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘హ్యాపీ రాజ్’ (Happy Raj) చిత్రంతో ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అబ్బాస్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. హీరోయిన్గా తెలుగు నటి శ్రీ గౌరీ ప్రియ నటిస్తుండగా.. ఆమె తండ్రిగా, అమెరికాలో నివసించే ‘రాజీవ్’ అనే ఎన్నారై పాత్రలో అబ్బాస్ కనిపించబోతున్నాడు. ట్రైలర్లో ఆయన లుక్ చూస్తుంటే, ఒకప్పటి ‘మిన్నలే’ (తెలుగులో ‘చెలి’) సినిమాలోని అబ్బాస్‌ను గుర్తుకు తెచ్చేలా స్టైలిష్‌గా ఉండటం విశేషం.
రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరియు రొమాంటిక్ కామెడీగా రాబోతుంది. పెళ్లి పీటల వరకు వెళ్లాలనుకునే ఒక జంటకు, వారి కుటుంబాల మధ్య ఎదురయ్యే సరదా సంఘటనలు, ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

