జీవి ప్రకాశ్‌కుమార్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’. మరియప్పన్ చిన్న దర్శకుడు. అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘లవ్యు లవ్యు రాకాసి’ అంటూ సాగే ఈ పాటను రాజ్శ్రీసుధాకర్ రాయగా, సామ్ సి.ఎస్ స్వరపరిచారు. అరవింద్, రేష్మా శ్యామ్ కలిసి ఆలపించారు.
ప్రేమలోని సరదా, అల్లరి భావాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ పాటలో జీవి ప్రకాశ్‌కుమార్, కయాదు లోహర్‌ల కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కలర్‌ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే డ్యాన్స్ మూమెంట్స్, ైస్టెలిష్ ప్రెజెంటేషన్‌తో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారని మేకర్స్ చెబుతున్నారు. టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ రాధాకృష్ణన్, నిర్మాణం: ఎకె ఫిల్మ్ ఫ్యాక్టరీ.