Guntur Kaaram Movie | గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌పై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ..!
Guntur Kaaram Movie | సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే లాక్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఈ సారి చెప్పిన డేట్ కన్ఫార్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.
Guntur Kaaram Movie | సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే లాక్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఈ సారి చెప్పిన డేట్ కన్ఫార్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. రెండు, మూడు పాటలకు సంబంధించిన మేకింగ్‌తో పాటు ఓ చిన్న టాకీ పార్టు మాత్రమే బ్యాలన్స్ ఉందట. త్రివిక్రమ్ ఈ సారి బాబును మాములుగా చూపించట్లేదని ఇన్సైడ్ టాక్. అతడు, ఖలేజా సినిమాలో క్యారెక్టర్లకు మాస్ తోడైతే ఏ రేంజ్లో ఉంటుందో మహేష్ రోల్ ఆ రేంజ్లో ఉంటుందట. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ను తాజాగా నాగవంశీ వెల్లడించాడు.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్పై త్వరలోనే క్లారిటీ ఇస్తామని.. దసరాకు సాంగ్ పక్కా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇది విన్న మహేష్ ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. తడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఇక ఈ మధ్య విడుదలైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు. ఇప్పటికే ఓ పాటను రెడీ కూడా చేశాడట. దసరా సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుందట. కేవలం నైజాం రైట్స్‌ను కోసమే దిల్‌రాజు కోట్లు ఆఫర్ చేశాడట. సరైన నెంబర్ తెలీదు కానీ.. ఇండస్ట్రీ టాక్ ప్రకారం రూ.45 కోట్లని సమాచారం. ఇక దిల్‌రాజు సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూశాడట. అవి చూసిన తర్వాత సంక్రాంతికి సరైన బొమ్మ ఇదేనని ఈ రేటు పెట్టాడట. ఇక మాములుగా దిల్‌రాజు అంటేనే సక్సెస్‌కు ఎగ్జాంపుల్. ఒకటి రెండు సినిమాలను జడ్జ్ చేయడంలో లెక్క తప్పాడు కానీ.. ఆయన జడ్జిమెంట్‌కు తిరుగుండదు. అలాంటి మనిషి గుంటూరు కారం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే మహేష్ అభిమానులు సినిమా వేరే లెవల్లో ఉండబోతుందని ఫిక్సయిపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

