లాఠీ, సొగసుచూడ తరమా, చూడాలనివుంది, మనోహరం, ఒక్కడు, అర్జున్.. ఈ సినిమాలు దర్శకుడిగా గుణశేఖర్ ఏంటో చెబుతాయి. ట్రెండ్‌కి భిన్నంగా సాహసంతో సినిమాలు తీయడం గుణశేఖర్ శైలి. ఆయన రీసెంట్ సినిమా ‘శాకుంతలం’ పౌరాణికం. ఈ రోజుల్లో ఆ సినిమా తీయడం నిజంగా సాహసమే. త్వరలో ఆయన మరో వైవిధ్యమైన కథతో రానున్నారు. సినిమా పేరు ‘యుఫోరియా’. ఈ యూత్‌ఫుల్ సోషల్ డ్రామాను గుణ హ్యాండ్‌మేడ్ ఫిలింస్ పతాకంపై నీలిమ గుణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.