సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తుంది

‘ఓ క్రైమ్ కామెడీని ఫ్యామిలీ నేపథ్యంలో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచి ఈ సినిమా కథ పుట్టింది. ప్రేక్షకులందరిని నిజాయితీగా నవ్వించడానికి చేసిన ప్రయత్నమిది’ అన్నారు సందీప్‌కిషన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించారు. నేడు ప్రేక్షకులముందుకొస్తున్నది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ “ఏ1 ఎక్స్‌ప్రెస్’ తర్వాత అందరు సరదాగా నవ్వుకునే సినిమా చేయాలనుకున్నా.
ఈ కథ నచ్చడంతో వెంటనే పట్టాలెక్కించాం. చిరంజీవిగారు ట్రైలర్ చూసి ఇలాంటి పాత్రలు నీకు బాగా కుదురుతాయని మెచ్చుకోవడం ఆనందంగా అనిపించింది. థియేటర్లో సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేయండి’ అన్నారు. తన కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకముందని దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ‘విష్ణు, రామ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌తో నేను చేసిన తొలి చిత్రాలు ఢీ, రెఢీ, దూకుడు, అదుర్స్ ఘనవిజయం సాధించాయి. సందీక్కిషన్తో తొలిసారి చేసిన ఈ సినిమా అదే సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తూ పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు. ఆద్యంతం హాస్యప్రధానంగా ఆకట్టుకునే చిత్రమిది.. సినిమా విజయం తథ్యమని నిర్మాత చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

