ప్రతాప్ పోతన్, అరవింద్‌కృష్ణ, అలీరెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గ్రే’. ‘ది స్పై హూ లవ్డ్ మీ’ ఉపశీర్షిక. రాజ్ మాదిరాజు దర్శకుడు. కిరణ్ కాళ్లుకూరి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘స్పై థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. కథ, కథనాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయి’ అని చెప్పారు.
‘మా సంస్థకిది తొలి చిత్రం. మధుబాబు షాడో నవల తరహాలో సాగుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అని నిర్మాత తెలిపారు. తన కెరీర్లో విభిన్నమైన పాత్రను పోషించే అవకాశం దక్కిందని హీరో అరవింద్‌కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్.ఆర్.చేతన్‌కుమార్, సంగీతం: నాగరాజు తాల్లూరి, రచన-దర్శకత్వం: రాజ్ మాదిరాజు.