Shraddha Das | భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, విస్మయం కలిగించే అంశాల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’. గ్లామరస్ బ్యూటీ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. వైవిధ్యభరితమైన కథాంశంతో పాటు హై-క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఆకట్టుకుంటున్న ‘త్రికాల’ కథాంశం
ప్రపంచం మొత్తం చీకటి మయమై, సందిగ్ధంలో పడినప్పుడు.. ఆ చీకటిని చీల్చుకుంటూ వెలుగుగా అవతరించే ఒక దివ్య శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. మన సనాతన ధర్మంలోని కొన్ని ఆసక్తికరమైన నిజాళ్లను, ఆధునిక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి దర్శకుడు మణి తెల్లగూటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇటీవల కాలంలో భక్తి, మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ‘త్రికాల’ విజయంపై చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
భారీ తారాగణం – పవర్ఫుల్ పాత్రలు
ఈ సినిమాలో శ్రద్ధాదాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో, కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ‘మాస్టర్’ ఫేమ్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్‌గా నిలవనున్నాయి. అలాగే పవర్ఫుల్ విలనిజంతో మెప్పించే నటుడు అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో నటించారు. సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు తమ నటనతో సినిమాను మరింత రక్తికట్టించారు.
దర్శకనిర్మాతల నమ్మకం
ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ఆవిష్కరించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులకు ‘త్రికాల’ సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను, థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తుందనే నమ్మకం మాకుంది” అని తెలిపారు.
నిర్మాతలు రాధిక–శ్రీనివాస్ మాట్లాడుతూ… సరికొత్త కాన్సెప్ట్, అద్భుతమైన మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది. మా సినిమా నచ్చడంతో చాగంటి ప్రొడక్షన్ LLP వారు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు అని హర్షం వ్యక్తం చేశారు.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘స్పిరిట్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అలాగే షాజిత్ హుమాయున్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ‘త్రికాల’ క్రేజ్ కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాలేదు. ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా ఊహించని స్థాయిలో భారీ బిజినెస్ జరిగింది. హిందీ శాటిలైట్ హక్కులతో పాటు, డబ్బింగ్ రైట్స్ కూడా భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం. టాలీవుడ్లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’, ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో వైవిధ్యాన్ని చాటుకున్న శ్రద్ధాదాస్ కెరీర్లో ‘త్రికాల’ ఒక మైలురాయిగా నిలిచిపోనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మే 29న థియేటర్లలో విడుదల కానున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
నటీనటులు
శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు.
సాంకేతిక విభాగం:
సమర్పణ, విడుదల: చాగంటి ప్రొడక్షన్ LLP
నిర్మాతలు: రాధిక–శ్రీనివాస్
సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి
కథ, దర్శకత్వం: మణి తెల్లగూటి
డీవోపీ: పవన్ చెన్న
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: షాజిత్ హుమాయున్
పీఆర్ఓ: అశోక్ దయ్యాల