అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధానపాత్రల్లో నటించిన ద్విభాషాచిత్రం ‘సూపర్ హీరో బాబు’. విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కేఎస్ సినిష్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని శుక్రవారం విడుదల చేశారు. ఇది సూపర్‌హీరో కథాంశమని టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ కూడా చెప్పకనే చెబుతున్నది. ఉత్కంఠకు గురిచేసే కథ, కథనాలతో ఈ సినిమా సాగుతుందని, అర్జున్‌దాస్, కథానాయిక తేజు అశ్విని, శాండీ మాస్టర్ కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సమర్పణ: సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, నిర్మాణం రెడాక్టడ్ స్టూడియోస్.