Gharshana-2 | వెంకటేష్- గౌతమ్‌మీనన్ ‘ఘర్షణ’ మూవీ సీక్వెల్ తెరకెక్కనుందా?
Gharshana-2 Movie | తమిళ డైరెక్టర్ గౌతమ్‌మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం తర్వాత ఈయన దర్శకుడిగా తెరకెక్కిన ముత్తు ఇటీవలే విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. తాజాగా గౌతమ్‌మీనన్ ఘర్షణ సీక్వెల్‌పై స్పందించాడు.
Gharshana-2 Movie | తమిళంతో పాటు తెలుగులోనూ సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులలో గౌతమ్ వాసుదేవ మీనన్ ఒకడు. ‘ఘర్షణ’, ‘ఏమాయ చేశావే’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ఈయన ప్రేమకథలకు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ స్టోరీస్‌ను అందంగా, పోయేటిక్‌గా చెప్పడం ఈయన ప్రత్యేకథ. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ శనివారం విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది.
ఇదిలా ఉంటే తాజాగా గౌతమ్ మీనన్ వెంకటేష్ ‘ఘర్షణ’ సినిమాపై స్పందించాడు. వెంకటేష్‌ను రీసెంట్గా కలిసినట్లు, ఘర్షణ సీక్వెల్ గురించి చర్చించినట్లు తెలిపాడు. అయితే సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇంకా రాయలేదని, కానీ త్వరలోనే ఖచ్చితంగా సీక్వెల్‌ను స్టార్ట్ చేస్తామని చెప్పాడు. అంతేకాకుండా చిరుతో ‘రాఘవన్’ స్టైల్లో ఓ థ్రిల్లర్ సినిమా చేయాలనుందని తెలిపాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా పలు సినిమాలు చేస్తూ
బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘సీతారామం’లో మేజర్ సెల్వన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈయన తన నెక్స్ట్ సినిమాను రామ్‌తో చేయనున్నట్లు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

