గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. జూలై 1న విడుదల చేయబోతున్నారు. ‘ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన లుక్స్ చాలా స్టెలిష్గా ఉంటాయి. స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. టీజర్ బాగుందంటున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కరమ్ చావ్ల, సంగీతం: జకేస్ బీజాయ్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమర్పణ: అల్లు అరవింద్.