Pakka Commercial | ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Pakka Commercial Trailer date | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు గోపిచంద్. గత కొంత కాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపిచంద్‌కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం మంచి వసూళ్ళను రాబట్టింది. ప్రస్తుతం ఈయన నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 3.55 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.
ఈసారి buffering ఉండదు!😉
Get Ready, #PakkaCommercialTrailer Releasing Tomorrow @ 3:55 PM!#AlluAravind @YoursGopichand @DirectorMaruthi#PakkaCommercial @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @GA2Official @UV_Creations @adityamusic #PakkaCommercialOnJuly1st pic.twitter.com/Et32jtGjIB
— UV Creations (@UV_Creations) June 11, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

