Pakka Commercial Promotions | చాలా కాలం తర్వాత గోపిచంద్‌కు ‘సీటీమార్’ మంచి హిట్‌గా నిలిచింది. కంటెంట్‌తో పాటు మాస్ యాక్షన్ కథలను ఎంచుకుంటున్న గోపిచంద్‌కు.. కావలిసినంత గుర్తింపు మాత్రం రావడంలేదు. యాక్టర్‌గా గ్రేట్ పర్ఫామెన్స్ ఇచ్చినా, కమర్షియల్ హీరోగా మాత్రం నిలబడలేకపొతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘పక్కా కమర్షియల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. కాగా ప్రమోషన్లలో భాగంగా గోపిచంద్ సినిమాపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
తాజాగా గోపిచంద్, మారుతి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆలీతో సరదాగా షోకు గెస్ట్లుగా వెళ్ళారు. ఈ షోలో గోపిచంద్ ప్రస్తుతం తాను హీరోగా మంచి స్థాయిలో ఉన్నప్పటికి.. కథ, పాత్ర నచ్చితే మరో సారి విలన్‌గా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, హీరోకు ధీటుగా ఉండే విలన్ పాత్రలను చేస్తానని వెల్లడించాడు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీవాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.