Gopichand31 Movie | గతకొంత కాలంగా గోపిచంద్ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ బిగెనింగ్‌లో వరుస హిట్లతో చెలరేగిపోయిన గోపిచంద్.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. నిజానికి గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. ‘లౌక్యం’ తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు హిట్టే లేదు. మధ్యలో ‘జిల్’, ‘గౌతమ్ నందా’, ‘సీటిమార్’ వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. భారీ అంచనాలతో ఇటీవలే విడుదలైన ‘రామబాణం’ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. తన కెరీర్లో రెండు భారీ విజయాలిచ్చిన శ్రీవాస్ సైతం ఈ సారి గోపిను కాపాడలేకపోయాడు. ప్రస్తుతం గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా గోపిచంద్ తన తదుపరి సినిమాను ఏ. హర్ష దర్శకత్వంలో చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను చిత్రబృందం వెల్లడించింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ ను గోపిచంద్ బర్త్ డే సందర్భంగా జూన్ 12న ప్రకటించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో గోపిచంద్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. గోపిచంద్ పోలీస్ క్యారెక్టర్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. దాంతో తనకు అచ్చొచ్చిన పోలీస్ క్యారెక్టర్‌ను ఈసారి నమ్ముకున్నట్లు సమాచారం. ఇక చివరగా గోపిచంద్ ‘గోలిమార్’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాడు. ఈ లెక్కన మళ్లీ పుష్కర కాలం తర్వాత ఖాకీ చొక్కా తొడుక్కోబోతున్నాడన్న మాట.