Gopichand | సెంటిమెంట్‌ను వదలని గోపిచంద్.. టైటిల్లో అది పక్కా ఉండాల్సిందే..!
గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపిచంద్‌కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయిన.. గోపిచంద్ గత సినిమాలతో పోలిస్తే మంచి విజయమే సాధించింది.
Gopichand-Sriwass Movie | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు మ్యాచో స్టార్ గోపిచంద్. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపిచంద్‌కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయిన.. గోపిచంద్ గత సినిమాలతో పోలిస్తే మంచి విజయమే సాధించింది. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు అనుకుంటుడగానే ‘పక్కా కమర్షియల్’తో డిజాస్టర్‌ను సాధించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుని కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది.
ప్రస్తుతం గోపిచంద్ ఆశలన్ని శ్రీవాస్‌తో చేయబోయే సినిమాపైనే ఉన్నాయి. టాలీవుడ్ బెస్ట్ కాంబోలలో వీళ్లది ఒకటి. గతంలో వీళ్ళ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్ హిట్లయ్యాయి. లౌక్యం తర్వాత గోపిచంద్‌కు ఇప్పటివరకు ఆ స్థాయిలో హిట్టు పడలేదు. ఇక శ్రీవాస్‌కు అంతే. లౌక్యం తర్వాత ఈయన తెరకెక్కించిన ‘డిక్టేటర్’, ‘సాక్ష్యం’ సినిమాలు అట్టర్ ఫ్లాప్స్‌గా మిగిలాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్ధరూ కలిసి మూడో సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
షూటింగ్ ప్రారంభై నెలలు గడుస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను వెల్లడించారు. ఈ సినిమాకు ‘రామబాణం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ సినిమా టైటిల్‌కు కూడా చివర సున్నా వచ్చింది. సున్నా సెంటిమెంట్ వీళ్ళ కాంబోకు బాగా కలిసి వచ్చిస్తుందని మూడో సినిమాకు కూడా సున్నా వచ్చేలా పెట్టుకున్నారు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటిస్తుంది. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

