మన ఇంట్లో జరిగే కథ
దర్శకుడు వాసుతో నాకిది మూడో చిత్రం. లక్ష్యం, లౌక్యం తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తుంటే మన ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
‘దర్శకుడు వాసుతో నాకిది మూడో చిత్రం. లక్ష్యం, లౌక్యం తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తుంటే మన ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఏపీలోని రాజమండ్రిలో ట్రైలర్‌ను విడుదల చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది. మిక్కీ జే మేయర్ మంచి పాటలిచ్చారు. ఈ వేసవిలో ఇంటిల్లిపాది కలిసి చూసే చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఈ సినిమాకు ‘రామబాణం’ అనే టైటిల్‌ను పెట్టినందుకు బాలకృష్ణగారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు. ‘కుటుంబ అనుబంధాలు, విలువల గొప్పతనం గురించి ఈ సినిమాలో చర్చించాం. జగపతిబాబు, గోపీచంద్ నటించిన సన్నివేశాల్ని చూస్తుంటే నిజంగా అన్నదమ్ములేమో అనుకుంటారు. అంతలా వారు పాత్రల్లో లీనమైపోయారు. గోపీచంద్‌ను నటుడిగా మరో మెట్టెక్కించే చిత్రమవుతుంది’ అని దర్శకుడు తెలిపారు. అలీ మాట్లాడుతూ ‘గోపీచంద్ ముప్పై సినిమాలు చేస్తే అందులో ఐదారు తప్పితే అన్ని చిత్రాల్లో ఆయనతో కలిసి నటించాను. గోపీచంద్ చాలా మంచి మనిషి. ఆయనకు ఎప్పుడూ విజయాలే దక్కాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

