Bheema Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా నెల రోజులు సమయం ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ (Edo Edo Maya Song) అనే సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. కల్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటను రవి బస్రూర్ కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. గోపీచంద్, మాళవిక శర్మ కాంబోలో వచ్చే ఈ పాట ఇంప్రెసివ్‌గా సాగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.