Bheema Movie | బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు.. గోపీచంద్ ‘భీమా’ టీజర్ రిలీజ్
Bheema Movie | టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Bheema Movie | టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ అసలు కథ గురించి ఏమాత్రం హింట్ ఇవ్వకుండా ఆసక్తికరమైన విజువల్స్‌తో సాగింది. ముఖ్యంగా టీజర్లో వచ్చే యదా యదా హి ధర్మస్య.. ‘పవిత్రాణాయ సాధూనాం.. అంటూ వచ్చే శ్లోకాలు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మరోవైపు ఈ రాక్షసులను.. వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు అంటూ గోపీచంద్ ఎద్దుపై ఎంట్రీ ఇవ్వడం టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

