Dil Raju l ఇండస్ట్రీకి మంచిరోజులొచ్చాయి
‘నిర్మాత ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మంచి సంకల్పంతో సినిమా తీస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయని ఈ తరంలో రాహుల్ యాదవ్ నిరూపించాడు’ అని అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు
‘నిర్మాత ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మంచి సంకల్పంతో సినిమా తీస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయని ఈ తరంలో రాహుల్ యాదవ్ నిరూపించాడు’ అని అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘మసూద’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నిర్మించారు. సోమవారం థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘వరుసగా మూడు హిట్స్ కొట్టిన నిర్మాత రాహుల్‌కు అభినందనలు. ఇటీవలకాలంలో మసూద, లవ్‌టుడే, హిట్-2..ఇలా వరుస విజయాలతో పరిశ్రమకు మంచిరోజులొచ్చాయనిపిస్తుంది’ అన్నారు. ఈ సినిమాకు మంచి స్క్రిప్ట్ దొరకడంతో పాటు అన్ని విషయాల్లో చక్కటి స్పష్టత కలిగిన దర్శకుడు సాయికిరణ్ పనితనం వల్ల ఈ విజయం సాధ్యమైందని, మూడోవారంలో కూడా మంచి వసూళ్లు ఉన్నాయని నిర్మాత రాహుల్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. టీమ్ అందరూ సాధించిన సమష్టి విజయమిదని దర్శకుడు సాయికిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సుమంత్, నిర్మాత లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dil raju
- hit 2
- Love Today
- Masooda
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

