Kajal: త్వరలో కాజల్ గుడ్ న్యూస్ చెప్పనుందట..!

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కల్యాణం చిత్రంతో వెండితెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ చందమామ సినిమాతో అందరి ఆదరణ అందుకుంది. ఆ తర్వాత ఏ సినిమా చేస్తే అది హిట్ అనేలా ఈ అమ్మడు కథలను ఎంచుకుంది. జూనియర్ హీరోలతోనే కాకుండా సీనియర్ హీరోలతోను నటించి సత్తా చాటింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది.
అక్టోబర్ 30,2020న కరోనా నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో గౌతమ్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం కాజల్ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ది గోస్ట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ మరియు గౌతమ్ కిచ్లూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక బాలీవుడ్ వెబ్ సైట్ ప్రచురించడంతో అభిమానులు కంగుతిన్నారు.
కాజల్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదు. తల్లి కాబోతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది అంటూ ప్రచారాలు చేస్తున్నారు. వీటిపై కొన్ని మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కాజల్ వీటిపై స్పందించకపోవడం వలన అవి మరింత ఎక్కువయ్యాయి. మరి వీటిపై కాజల్ వీలైనంత త్వరగా స్పందించాలని అభిమానులు కోరుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Gautham kitchlu
- kajal
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసం చేసిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

