అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘గోల్డ్ స్పాట్’. వేణు కార్తికేయన్ దర్శకుడు. రవితేజ పచ్చిపాల నిర్మాత. సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. తన స్నేహితుడు రామ్ గురించి హీరోయిన్ చెబుతుండంతో గ్లింప్స్ మొదలైంది. ‘అమ్మను చిన్నప్పుడే తీసుకెళ్లిపోయిన ఆ దేవుడే, నాకు రామ్‌ను పరిచయం చేశాడు’ అంటూ హీరోయిన్ చెప్పడం, ఆమె అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నదో తెలియజేస్తున్నది.
‘మనకు జీవితంలో ఎంతోమంది పరిచయమవుతుంటారు. కానీ ఒక్కరే జీవితంగా మారిపోతారు..’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ హార్ట్ టచింగ్‌గా ఉంది. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫేం దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలను అందించడం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: మహీరెడ్డి, సంగీతం: నరేన్‌రెడ్డి. సమర్పణ: విజయ్‌కృష్ణ లింగమనేని.