GodFather | ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా గాడ్‌ఫాదర్ సరికొత్త రికార్డు..!
గ్రాండ్‌గా రీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్న చిరు.. అదే గ్రాండ్‌నెస్‌ను తన తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. 'ఖైదీ నెంబర్150' వంటి నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ తర్వాత 'సైరా', 'ఆచార్య' చిత్రాలు భారీ పరాజయాలు సాధించాయి.
GodFather Movie On Ott | గ్రాండ్‌గా రీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్న చిరు.. అదే గ్రాండ్‌నెస్‌ను తన తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ‘ఖైదీ నెంబర్150’ వంటి నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సైరా’, ‘ఆచార్య’ చిత్రాలు భారీ పరాజయాలు సాధించాయి. ఈ క్రమంలో చిరు ఎలాగైనా హిట్ సాధించాలని మలయాళ రీమేక్‌ను నమ్ముకుని ‘గాడ్‌ఫాదర్’తో దసరాకు ప్రేక్షకులను పలకరించాడు. అయితే మెగాస్టార్‌కు ఈ సారి కూడా నిరాశే మిగిలింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మొదటి ఈ చిత్రానికి పాజిటీవ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు థియేటర్ల వైపు మొగ్గు చూపలేకపోయారు. అయితే ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.
ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 20 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కాగా 12 రోజులుగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్‌లో టాప్-1లో ఉంది. ఆర్ఆర్ఆర్(14రోజులు) తర్వాత ఆ ఘనత సాధించిన రెండో తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఇదే కంటిన్యూ అయితే ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. వెండితెర ప్రేక్షకుల మెప్పు పొందకపోయినా.. ఓటీటీ ప్రియులను మాత్రం ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలకపాత్ర పోషించింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్‌రోల్‌లో మెరిసాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

