Godfather Movie | అప్పుడే ఓటీటీలోకి ‘గాడ్‌ఫాదర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Godfather Movie On OTT | మెగాస్టార్ ప్రస్తుతం మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత చిరు వరుసగా సినిమాలు చేస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం హిట్ అందుకోలేకపోతున్నాడు.
Godfather Movie On OTT | మెగాస్టార్ ప్రస్తుతం మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత చిరు వరుసగా సినిమాలు చేస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం హిట్ అందుకోలేకపోతున్నాడు. ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజైన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం కూడా మెగాస్టార్‌కు నిరాశే మిగిల్చింది. రిలీజ్ రోజున పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఫైనల్‌గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగు నెటీవిటీకు తగ్గట్టు కొన్ని మార్పులు చేసి గాడ్‌ఫాదర్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఓపెనింగ్స్ భారీ గానే వచ్చిన సెకండ్ డే నుండి డ్రాప్స్ పడ్డాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నవంబర్ 19నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార కీలకపాత్రలో నటించింది. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్‌రోల్‌లో మెరిసాడు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

