Godari Gattupaina | గోదారి గట్టుపైన రివ్యూ: గుండెలను హత్తుకునే తండ్రీకూతుళ్ల అనుబంధం!
Godari Gattu paina | మేం ఫేమస్ చిత్రంతో యూత్ ఆడియెన్స్‌కు చేరువైన సుమంత్ ప్రభాస్, సుదీర్ఘ విరామం తర్వాత నటించిన తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’. ఈ చిత్రం నేడు (మే 8, 2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Godari Gattupaina | మేం ఫేమస్ చిత్రంతో యూత్ ఆడియెన్స్‌కు చేరువైన సుమంత్ ప్రభాస్, సుదీర్ఘ విరామం తర్వాత నటించిన తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’. ఈ చిత్రం నేడు (మే 8, 2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గోదావరి తీర ప్రాంత నేపథ్యంలో, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాల మధ్య దర్శకుడు సుభాష్ చంద్ర ఈ చిత్రంను తెరకెక్కించగా ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ
కోనసీమలోని ఓ మారుమూల గ్రామంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే శ్యామ్ బాబు (జగపతిబాబు)కు తన కూతురు మాయ (నిధి ప్రదీప్) అంటే ప్రాణం. ఆమె సంతోషమే తన ప్రపంచంగా బ్రతుకుతుంటాడు. అయితే, మాయ జీవితంలోకి ఆటో డ్రైవర్ రాజు (సుమంత్ ప్రభాస్) ప్రవేశించడంతో కథ మలుపు తిరుగుతుంది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ, భిన్నమైన సామాజిక నేపథ్యాల కారణంగా తండ్రీకూతుళ్ల మధ్య ఎలాంటి సంఘర్షణకు దారితీసింది? చివరకు ప్రేమ గెలిచిందా లేక తండ్రి బాధ్యత గెలిచిందా? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.
నటీనటుల
తెలంగాణ యాసకు అలవాటు పడిన సుమంత్, ఈ సినిమాలో గోదావరి యాసను ఎంతో సహజంగా పలికించి ఆశ్చర్యపరిచారు. ఆటో డ్రైవర్ పాత్రలో ఆయన నటన పరిణతి చెందింది. కూతురి భవిష్యత్తు కోసం ఆరాటపడే సగటు తండ్రి పాత్రలో జగపతిబాబు మరోసారి తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సినిమాకు ఆయనే ప్రధాన బలం. తొలి సినిమా అయినప్పటికీ, భావోద్వేగపూరితమైన సన్నివేశాల్లో నిధి చక్కటి ప్రతిభ కనబరిచారు.
నెల్లూరు సుదర్శన్ మార్క్ కామెడీ సినిమాకు పెద్ద ఎసెట్. బోరింగ్ సీన్స్‌లో కూడా తన పంచ్‌లతో థియేటర్లో నవ్వులు పూయించారు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు సుభాష్ చంద్ర పాత కథనే తీసుకున్నప్పటికీ, దానికి భావోద్వేగాలను అద్ది తెరకెక్కించిన తీరు బాగుంది. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ గోదావరి అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. నాగవంశీ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయింది.
విశ్లేషణ:
సినిమా ప్రథమార్థం ప్రేమకథ మరియు కామెడీతో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ పూర్తిగా ఎమోషన్స్ మీద ఆధారపడింది. కొన్ని చోట్ల కథ నెమ్మదించినట్లు అనిపించినా, క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ తండ్రీకూతుళ్ల బంధం ప్రేక్షకులను కదిలిస్తుంది. “అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది”, “అతను ఫ్యాక్టరీకి కాదు.. కుటుంబానికి సెక్యూరిటీ గార్డ్” వంటి సంభాషణలు మనసును హత్తుకుంటాయి.
ప్లస్ పాయింట్స్:
జగపతిబాబు, సుమంత్ ప్రభాస్ నటన.
హృదయానికి హత్తుకునే క్లైమాక్స్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్.
ఆహ్లాదకరమైన విజువల్స్ మరియు పల్లెటూరి వాతావరణం.
నెల్లూరు సుదర్శన్ కామెడీ టైమింగ్.
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం కొరవడటం
అక్కడక్కడా నెమ్మదించిన కథనం.
ముగింపు:
మొత్తానికి ‘గోదారి గట్టుపైన’ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాగే ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి చూడదగ్గ ఒక పాజిటివ్ ఫ్యామిలీ డ్రామాగా దీనిని అభివర్ణించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

