GOAT Movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా సినిమా తేదీని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే తాజాగా మూవీ నుంచి మరో మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రకటించాడు. ఇక ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రష్యాలో జరుపుకుంటుంది. రష్యాలో విజయపై యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Let’s begin 😊#GoatFirstSingle #TheGreatestofAllTime @actorvijay @vp_offl @Ags_production pic.twitter.com/c37K9DSLYo
— Raja yuvan (@thisisysr) April 13, 2024