CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్ మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. జపాన్ దేశపు అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక వార్తాపత్రిక ‘అసాహి షింబున్’ (Asahi Shimbun 1879) తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది, దీనితో విజయ్ విజయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
సుమారు 7.7 కోట్ల జనాభా కలిగిన తమిళనాడుకు ప్రముఖ భారతీయ నటుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యారంటూ ఈ పత్రిక విశేషంగా కొనియాడింది. కేవలం రెండు ఏళ్ల క్రితమే ఆయన సొంతంగా స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ, ఈ నెల 4న వెలువడిన ఫలితాల్లో ఘనవిజయం సాధించి, నేడు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడాన్ని జపాన్ మీడియా ఒక సంచలనంగా అభివర్ణించింది. ఒక సినిమా నటుడు సొంత పార్టీ పెట్టి ఇంత తక్కువ కాలంలోనే ఒక పెద్ద రాష్ట్రానికి నాయకత్వం వహించడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆసక్తి కనబరుస్తోందని, ఈ నేపథ్యంలోనే అసాహి షింబున్ తన విశ్లేషణాత్మక కథనంలో విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రముఖంగా ప్రస్తావించిందని తెలుస్తోంది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను దాటుకుని విజయ్ సాధించిన ఈ విజయం ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.
インド人気俳優ビジャイ氏が州首相に 「コリウッド」のタミルナド州 https://t.co/LQ8gIuBMIX
インドの人気映画俳優、C.ジョセフ・ビジャイ氏が10日、南部タミルナド州(推計人口約7700万)の首相に就任した。4日に開票された州議会選挙で、2年前に自ら立ち上げた新政党TVKから立候補し当選。
— 朝日新聞(asahi shimbun) (@asahi) May 10, 2026