Ghost Movie | ‘ఘోస్ట్’ మూవీ ప్రమోషన్స్‌లో పునీత్‌ను గుర్తుచేసుకున్న శివరాజ్ కుమార్
Shiva Rajkumar | కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ (Shiva Rajkumar ) అలియాస్ శివన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వందకుపైగా సినిమాల్లో నటించిన ఆయన కన్నడలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించాడు. ఇటీవలే జైలర్ సినిమాలో కామియోలో కనిపించి అభిమానులను థ్రిల్ చేశాడు.
Shiva Rajkumar | కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ (Shiva Rajkumar ) అలియాస్ శివన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వందకుపైగా సినిమాల్లో నటించిన ఆయన కన్నడలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించాడు. ఇటీవలే జైలర్ సినిమాలో కామియోలో కనిపించి అభిమానులను థ్రిల్ చేశాడు. ఇక శివన్న నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఘోస్ట్’(Ghost). ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫప్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
విజయదశమి కానుకగా.. అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేరళకు వెళ్లిన శివరాజ్ కుమార్ ఒక ఈవెంట్లో తన తమ్ముడు దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకున్నారు. ‘ఘోస్ట్’(Ghost). ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. పునీత్ రాజ్‌కుమార్ మరణం నాకు ఎప్పటికీ ఒప్పుకోలేని విషయం. పునీత్ నాకంటే 12-13 ఏళ్లు చిన్నవాడు. నేను నా భావాలను వ్యక్తపరచలేను. నేనెప్పుడూ పునీత్ సమాధి వద్దకు వెళ్లను. ఎందుకంటే అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించరు. తాను అలాంటి పద్ధతులను నమ్మే వ్యక్తిని కాదని, పునీత్ చనిపోయానని తాను అంగీకరించగలిగితేనే ఇలాంటివి ఆలోచించడం, చేయడంలో అర్థం ఉంటుందని శివరాజ్ కుమార్ అన్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్‌లో అలరించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

