ఆర్ఆర్ఆర్ గర్జనకు సిద్ధం కండి.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల లిస్ట్ చూస్తే అందులో ఆర్ఆర్ఆర్ తప్పక ఉంటుంది. రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనే దానిని ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా చూపించనున్నట్టు తెలుస్తుంది.
చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల కాగా, ఇవి ప్రేక్షకులకు అమితమైన ఆనందాన్ని కలిగించాయి. ఇక ఈ సినిమా నుండి ఏమైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో జూలై 15 ఉదయం 11గం.లకు ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటుంది. నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోవడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను హోల్‌సేల్‌గా సొంతం చేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Rajamouli
- ram charan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

