Geethanjali Malli Vachindi | ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
Geethanjali Malli Vachindi | టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది.
Geethanjali Malli Vachindi | టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కథనాయకుడిగా నటిస్తుండగా.. సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజలి 50వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తుండగా.. శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొత్త సంవత్సరం కానుకగా మూవీ నుంచి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు హీరో సునీల్ ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో పాడుబడిన బిల్డింగ్‌లో అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ, సునీల్ ఉండగా.. పైకి దేనినో సీరియస్‌గా చూస్తున్నట్లు ఉంది. ఇక వీళ్ళందరూ ఎందుకు అలా చూస్తున్నారు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

