గౌతమ్కార్తిక్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎస్.ఎస్.పొన్కుమార్ దర్శకుడు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్వీప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర సమర్పకుడు ఏ.ఆర్.మురుగదాస్ మాట్లాడుతూ ‘పీరియాడిక్ మూవీ ఇది. 1947 ఆగస్ట్ 14,15,16 తేదీల్లో ఓ మారుమూల పల్లెటూరిలో కథ జరుగుతుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని ఆ గ్రామస్తులకు చేరకుండా ఓ బ్రిటీష్ అధికారి దాచిపెడతాడు. ఈ క్రమంలో ఏం జరిగిందన్నదే చిత్ర కథ. యాక్షన్, ఎమోషన్స్, కామెడీ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇదని హీరో గౌతమ్ కార్తిక్ తెలిపారు. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ైక్లెమాక్స్ చూస్తుంటే ఉద్వేగానికి లోనయ్యాను’ అన్నారు.