నల జిలకర మొగ్గ..
ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. టైటిల్‌రోల్ ఆనంది పోషిస్తున్నది. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఏపీలోని ఆదోనిలో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రెగ్యులర్ షూటింగ్ మొదలుకాక ముందే విభిన్నంగా సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు.
ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. టైటిల్‌రోల్ ఆనంది పోషిస్తున్నది. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఏపీలోని ఆదోనిలో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రెగ్యులర్ షూటింగ్ మొదలుకాక ముందే విభిన్నంగా సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా గరివిడి లక్ష్మి వల్ల విశేష ప్రాచుర్యం పొందిన ‘నల జిలకర మొగ్గ..’ అనే జానపద గేయాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలోని ఈ పాట అక్కడి సంస్కృతికి, జానపద సంప్రదాయానికీ దర్పణంగా నిలిచిందని, ఉత్తరాంధ్ర సాంస్కృతిక చరిత్రలో గరివిడి లక్ష్మికి శాశ్వత స్థానాన్ని ఈ పాట సంపాదించిపెట్టిందని, యువతిలోని గంభీరత్వాన్ని తెలుపుతూ, శక్తివంతమైన సందేశాన్ని ఈ పాట అందించిందని, అక్కడి జనం తరతరాలుగా ఇష్టపడుతున్న క్లాసిక్ ఈ జానపదమని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వారు అన్నారు. నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె.ఆదిత్య, సంగీతం: చరణ్ అర్జున్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

