Gangs of Godavari | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటిస్తున్న సినిమాల్లో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). విశ్వక్ సేన్ 11 (VS11)గా వస్తోన్న ఈ చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇటీవలే మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమా విడుదలయ్యేది ఎప్పుడో తెలియజేశారు.
ఈ మూవీని డిసెంబర్ 8న విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయని తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్టు నెట్టింట ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో సాగే యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నయా రిలీజ్ డేట్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వడమే ఆలస్యమని ఫిలంనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
ఇప్పటికే లాంఛ్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశ్వక్సేన్ దీంతోపాటు VS10లో కూడా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గామి (Gaami) కూడా పూర్తి చేశాడు. గామి రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..
#VishwakSen & #Nehashetty Dance Performance #SuttamlaSoosi Song Launch Event #GangsofGodavari pic.twitter.com/CKHuj7YNbJ
— Suresh PRO (@SureshPRO_) August 16, 2023
Stylish & intense ‘Mass ka Das’ @VishwakSenActor ‘s #VS10 is hitting the road soon🚗
Title announcement & glimpse on August 6th. Watch out!🔥🔥#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/rSkJV7lzAQ
— Ramesh Bala (@rameshlaus) July 23, 2023