Gangs of Godavari | టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గామి సినిమాతో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో తాజాగా మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు. విశ్వక్సేన్ ప్రధానపాత్రలో వస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది.
ఈ చిత్రం చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ మూవీని గతేడాది డిసెంబర్ 8న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. అనంతరం మార్చి 8న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే మార్చి నెలలో ఈ సినిమా విడుదలవ్వలేదు కానీ ‘గామి'(Gaami) మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మరోసారి చిత్రయూనిట్ ప్రకటించింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అనంతరం మే 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది.
Get ready to witness the Most rugged and violent tale from the banks of Godavari! 🔥🌊
#GangsofGodavari to release on 𝗠𝗮𝘆 𝟭𝟳𝘁𝗵 𝟮𝟬𝟮𝟰, worldwide.
Meet you in theatres this Summer. #GOGOnMay17th 💥 pic.twitter.com/A8u0RKKJI2
— VishwakSen (@VishwakSenActor) March 16, 2024
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశ్వక్సేన్ మరోవైపు VS10లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గామి (Gaami) కూడా పూర్తి చేశాడు.