గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
నేడు హీరో బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ట్రైలర్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ల మధ్య సంభాషణలతో సరదాగా ఈ టీజర్ ట్రైలర్ సాగింది. ఒక ముఖ్య విషయాన్ని నాయికకు చెప్పేందుకు హీరో సందేహిస్తున్నట్లు, అసలు విషయాన్ని చెప్పలేకపోతున్నట్లు ఈ వీడియోలో ఉంది. త్వరలో ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపారు. సకుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ఈ సినిమా ముస్తాభవుతున్నది.